#


Index

ఉపసంహారము (ప్రధమ) భగవద్గీత

ఉపసంహారము

  కభగవద్గీతలో ఇప్పటి కారధ్యాయాలు పూర్తి చేశాము. అంటే మొదటి షట్కమయిం దన్న మాట. దీనితో త్వం పదార్థ శోధన కూడా చేసిన వాళ్లమయ్యాము. తత్త్వమసి మహావాక్యంలో త్వం పదార్ధ విచారణే మొదటి ఆరధ్యాయాలకూ విషయమని ఆదిలోనే ప్రస్తావించి ఉన్నాను. త్వం పదార్ధమంటే జీవుడు. జీవుడు శుద్ధి అయితే గాని వాడీశ్వర సాయుజ్యాన్ని పొందలేడు. శుద్ధి లేకుండా జీవుడు లోకంతో వ్యవహరించవచ్చు. సంగీత సాహిత్యాది కళలెన్నైనా అభ్యసించవచ్చు. తర్క జ్యోతిష గణిత భౌతిక రసాయనాది శాస్త్రాలన్నింటిలో ప్రవీణత గడించవచ్చు. ఆఖరు కధ్యాత్మ శాస్త్రంలో కూడా పరోక్ష జ్ఞాన మెంతైనా సంపాదించవచ్చు. దానికి సిద్ధమయి ఉంటే చాలు జీవుడు. శుద్ధుడు కానక్కర లేదు. కాని జీవుడీశ్వర సాయుజ్యం పొందాలంటే మాత్రం సిద్ధత కాదు శుద్ధత ఉండితీరాలి.

  కారణమేమంటే జీవుడు జీవుడుగా ఉంటూనే ఆయా విద్యలూ కళలూ సాధించవచ్చు. జీవుడంటే కర్తా భోక్తా. ఒక పని చేస్తున్నానని భావించేవాడూ చేయటం మూలంగా దాని ఫలితం కూడా సాధించేవాడూ. మొదటి దహంకారమైతే రెండవది మమకారం. ఇవి రెండూ ఇటు లోక వ్యవహారానికీ

Page 549

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు