కర్మ యోగము
భగవద్గీత
3. కర్మ యోగము
విషాద సాంఖ్య యోగాలు రెండూ అయి ప్రస్తుతం కర్మయోగమనే మూడవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. కానీ ఒక సందేహముంది చాలా మంది కిక్కడ. సాంఖ్యయోగంలోనే కర్మయోగాన్ని చాలావరకు వర్ణించాడు గదా వ్యాసభగవానుడు. దానితోనే గతార్ధ మయినప్పుడు మరలా దాన్ని గురించి క్రొత్తగా చెప్పవలసింది ఏముంది. అలాకాదు. అది జ్ఞానమిది కర్మ అని వేర్వేరుగా చెప్పదలచారా. అలాంటప్పుడు సాంఖ్యయోగంలో జ్ఞానమే వర్ణించాలి గాని అందులో కర్మయోగ మనేది చొప్పించటం దేనికి కర్మయోగం కోసం ప్రత్యేకంగా మరొక అధ్యాయమే వ్రాస్తున్నారు గదా అని ప్రశ్న వస్తుంది.
Page 203