శేషశాస్త్రి గారితో నా అనుభవం
గడియారం శేషశ్రాస్త్రి గారితో నాకు మొదటి నుంచీ అంత పెద్ద పరిచయం లేదు. మా ప్రాంతం వేరు. ఆయన ప్రాంతం వేరు. కాని నేను రాయలసీమ కళాశాలల్లో చాలా కాలం పని చేయటం మూలంగా వారితో కొంత పరిచయ మేర్పడింది. అప్పుడప్పుడు ఏవైనా సభలలోనూ సమావేశాల లోనూ కలుసుకోటం తటస్థిస్తూ ఉండేది. అంతే కాక నేను పది పదిహేను సంవత్సరాలుగా ప్రొద్దుటూరులోనే ఉండడం వల్ల ఐదారు సార్లు వారింటికి కూడా వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఇదీ నాకు వారితో ఉన్న అనుబంధం.
గడియారం వారనగానే మొట్టమొదట వారి శివభారతం గుర్తుకు వస్తుంది. ఆధునిక కాలంలో ఇది ఒక చక్కని చారిత్రక ప్రబంధం. ఇతి వృత్త మెంత ఉదాత్తమైనదో రచన కూడా అంత ప్రసన్నంగా సాగింది. మనకీ కాలంలో ఖండ కావ్యాలున్నవేమో కాని కొనా మొదలు ఇంత ఒడుదుడుకులు లేకుండా సాగిన మహాకావ్యం లేదు. పైగా కవి కవిత కోసమే గాక సార్వకాలికమైన సార్వజనీనమైన జీవిత సత్యాలను చాటటం ఇందులో ఒక గొప్ప విశేషం. అతిలోకమైన కవితా శిల్పం కాకపోయినా అతి సూక్ష్మమైన చిత్ర విచిత్రమైన మానవ మనస్తత్త్వాన్ని విప్పి చెప్పటంలో గొప్ప విజయాన్నే సాధించిన కావ్యమిది. ప్రసన్న గంభీరమైన ఈ కావ్యం మహాభారతం లాగానే భారతీయత అనేది లోకంలో ఉన్నంత వరకు బ్రతుకు తుందనటంలో సందేహం లేదు. కవి బ్రహ్మ చెప్పినట్టిది ఆంధ్రావళి మోద ముంబొరయు ఒక అద్భుతమైన కళాఖండం.
Page 14