#


Index

  అందుకే నేమో అనిర్వచనీయమని వర్ణిస్తారు పెద్దలు దీన్ని, ఉందని చెప్పలేము. లేదనీ చెప్పలేము. సత్తు కాదిది. అసత్తు కాదు. చూడండి. ఘట మసత్తన టానికి లేదు. మృత్తికగా సత్తే అది. అలాగే సత్తన టానికి లేదు. మృత్తికకు వేరుగా ఘటమనే రూపం ఎక్కడా లేదు. అలాగే ఈ జీవుడనే విశేష దృష్టి జగత్తనే విశేష దృశ్యమూ ఒక ఘటం లాగా ఉందనలేము. లేదన లేము. సచ్చిద్రూపంగా సత్యమే రెండూ. తదన్యంగా రెండూ అసత్యమే. అయితే చమత్కార మేమంటే అసత్యమైనా భాసించటం. అదే ఆభాస. అభాస అనేది ఒకటి స్వతంత్రంగా ఉండి కాదు భాసించటం. అలా చెబితే విశేషానికి అస్తిత్వం చెప్పినట్టవుతుంది. సామాన్యానికి వేరుగా విశేషం లేదని గదా సిద్ధాంతం. అలాంటప్పుడీ భాసదేని ఆభాస. వస్తువు ఆభాసే కావాలి. వస్తువే ఇంకొక రూపంలో భాసిస్తున్నది. ప్రతీతి మాత్ర మిది. యథార్ధం కాదు. అయినా ఎందుకలా భాసిస్తున్నది.

  అలా భాసించట మాత్మ కాదు. మరేమిటి. ఆత్మ అలా భాసిస్తున్నదని భావించే ఒక విశేషాత్మ. అదే జీవుడు జీవుడంటున్నాడు ఈ అనాత్మను చూచి ఆత్మే ఇలా భాసిస్తున్నదని. వీడి భావన సనుసరించి ఈ అభాస. అయితే జీవుడెందుకిలా భావించ వలసి వచ్చింది. అసలైన ఆత్మ దృష్టి లేక. ఆత్మ దృష్టి లేక జీవు డయ్యాడా - జీవుడై తత్కారణంగా ఆత్మ దృష్టి కోలుపోయాడా - జీవుడు ముందా అజ్ఞానం ముందా అని ప్రశ్న వచ్చింది. ఇది ఉంటే గాని అది లేదు. అది ఉంటే గాని ఇది లేదు. అన్యోన్యాశ్రయ మనే దోషమిది. బీజ వృక్ష న్యాయమిలాంటిదే.

  అయితే ఏమిటిక దీనికి పరిష్కారం. జీవుడవై కోరుతున్నావా పరిష్కారం ఆత్మవై కోరుతున్నావా ? ఆత్మ వైతే అడగనే అడగవు. ఎందుకంటే నీకప్పుడు అజ్ఞానమే లేదు. మరి జీవుడవై అడిగావో.

Page 137