#


Index

  అంటే అర్ధం. సామాన్యం కాదు ఎక్కడికక్కడ విశేష రూపమైన చైతన్యమే నా స్వరూప మని భావిస్తున్నాము.దానికి నిదర్శనమే మనకీ దేహాత్మాభిమానం. అంటే దేహం మేరకే పరిమితమై ఉన్నామనే భావం. ఇది మనందరికీ ఇప్పుడును భవసిద్ధమే కదా ! అనుభవంలో ఉన్న దానికిక వివరణ అక్కర లేదు.

  అయితే ఇది మనకు వాస్తవం కాదీ జీవ భావం. వాస్తవంలో పరమాత్మే మనం. మరి అవాస్తవమైన ఈ అభిమానం మన కెలా ప్రాప్తించింది. చెప్పాము కదా అజ్ఞానం వల్లనని. సామాన్యంగా చూడక మన స్వరూపాన్ని విశేషంగా భావించటమే జరిగిన మోసం. కాని సామాన్యమే వస్తుతః అన్నింటికీ అధిష్ఠానం. అన్నింటికీ అంటే విశేషా లన్నింటికీ అని అర్ధం. అధిష్ఠానమే వీటికి స్వరూపం. అలాటి అదిష్టాన జ్ఞానం కోలుపోవటం మొదటి అపరాధం. దానికి మారుగా విశేష జ్ఞానమే నేననుకొని విశేష రూపమైన దేహాదులను బాహ్యమైన పృథివ్యాదులను నెత్తిన బెట్టుకొని దానితో సతమతం కావటం రెండవ మాగాధం. దీనికే అధ్యారోప మని పేరు. అందులోనూ సహజాధ్యారోప మిది. ఎప్పుడు చేశామో ఎందుకు చేశాయో మనకే తెలియదు. కాలిలో గ్రుచ్చుకున్న ముల్లు ఎలా గ్రుచ్చుకున్నదో తెలియ నట్టే. లోకులందరికీ ఇది సాధారణమైనది. గనుక సహజాధ్యారోప మన్నారు దీన్ని.

  ఇది రెండు విధాలు. ఆత్మను తెచ్చి అనాత్మ మీద ఆరోపించట మొకటి. ఇదే మిథ్యాత్మ. అలాగే అనాత్మను తెచ్చి ఆత్మ మీద ఆరోపించట మొకటి. ఇదే గౌణాత్మ. దీనితో అసలైన ముఖ్యాత్మ మరుగు పడిపోయింది. అభావం కాదది. అనుపలబ్ది. అధిష్ఠాన మెప్పుడూ అభావం కాబోదు. అది అభావమైతే దాని మీద ఆరోపితమైన జీవ జగత్తు లిలా కనిపించటం ఎప్పటికీ జరగదు. ఇవి ఇప్పుడు మనకు భావ రూపంగా అనుభవానికి వస్తున్నాయంటే వీటి కాధారమైన అది అభావమెలా అవుతుంది.

Page 135