బృహదారణ్యకం
దశోపనిషత్తులలో ఆఖరిది బృహదారణ్యకం. ఇది పరిమాణంలోనూ గుణంలోనూ పెద్దది. ఛాందోగ్యం పరోక్షమైన Indirect జ్ఞానమిస్తే ఇది అపరోక్షమైన Direct అనుభూతినే ప్రసాదిస్తుంది మానవుడికి. దాన్ని ఒక మాటలో గుప్తం చేసి చెబితే అదే అహం బ్రహ్మాస్మి. నేనే బ్రహ్మం బ్రహ్మమే నేనని భావం. బ్రహ్మమనేది ఎక్కడో దూరంగా ఉందనే భ్రాంతి పోవాలి మనకు. అది ఎంత దూరమో అంత దగ్గర. యదేహ తదముత్ర. నిరాకారమూ వ్యాపకమూ అయిన ఆకాశానికి దూరం దగ్గర ఏముంది. సర్వత్ర ఉందని చూడటం లేదా మనం. అలాగే అంతకన్నా పెద్దదైన జ్ఞానస్వరూపమైన ఆకాశ మాత్మ అనేది. ఇది జడాకాశమైతే అది చిదాకాశం Con-scious Space. నన్ను నేను ఎలా ఉన్నానని చూచు కొంటున్నానో నా చుట్టూ ఉన్న జగత్తును కూడా ఉందనే చూస్తుంటాను. ఈ ఉండటమనే స్ఫురణ ఇప్పుడెక్కడ ఉందంటావు. నా లోపలా వెలపలా అంతటా పరుచుకొనే ఉందా లేదా.
Page 25