#


Index

ప్రస్థానత్రయ సారము

  మన మనోభావాల దగ్గరి నుంచి బాహ్యమైన ఆకాశం వరకూ ప్రతిదీ ఉంది స్ఫురిస్తున్నదనేగా చూస్తున్నావు. ఆ ఉండటం స్ఫురించటమే పరమాత్మ. అదే ఆశ్రయ Basis మీ నామరూపాలకు. ఇవేవో స్వతహాగా ఉన్నాయని గాదు. అలా స్వతంత్రంగా ఉన్నదా సచ్చిద్రూపమైన ఆత్మే. అదే ఈ నామరూపాలుగా కూడా భాసిస్తున్నది. ఇవి దాని విభూతి Manifestation ໙໖ ໖໖ . Substance.

  ఇలా అర్థం చేసుకోగలిగితే జనన మరణాలు కూడా మన స్వరూపమే అయి అమృతత్వమే సిద్ధిస్తుంది మానవుడికి. ఈ రహస్యం శ్వేత కేతువనే కుఱ్ఱవాడి కుద్దాలకుడూ నారదుడనే దేవర్షికి సనత్కుమారుడూ -చివరకు దేవేంద్రుడికి బ్రహ్మ దేవుడూ - బోధ చేశారని చెబుతున్నది ఛాందోగ్యం. దీనికే భూమ విద్య అని పేరు పెట్టింది. ఎక్కడ ఉందా భూమ The summum Bonum అని అడిగితే సఏవోపరిష్టాత్స ఏవాధస్తాత్ - ఇక్కడా అక్కడా అని తేడా లేదు. సర్వత్రా సర్వదా సర్వరూపాలలో పరుచుకొని ఉన్నదదే. అదే జీవుడి స్వరూపమదే ఈ ప్రపంచ స్వరూపమని బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక రహస్యం మనకుపదేశిస్తుంది ఛాందోగ్యం.

Page 24

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు