#


Index

విభూతి యోగము భగవద్గీత

దండో దమయతా మస్మి - నీతి రస్మి జిగీషతాం
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞాన వతా మహమ్ - 38


  లోకాన్ని అపమార్గంలో పోకుండా దమించే అనగా శాసించే వారందరిలో ఉన్న దండ నీతిని నేనే. జిగీషతాం జయాభిలాష ఉన్న వీరులందరిలో ఉన్న రాజనీతిని నేనే. మౌనం చైవాస్మి గుహ్యానాం. గుహ్యమంటే దాచుకోవలసింది. రహస్యం. అలాటి రహస్యాలన్నింటిలో మౌనమనే గొప్ప రహస్యాన్ని నేను. పైకిచెబితే ఏదీ రహస్యం కాదు. దాచినా మనసులో మెదులుతుంటే కూడా కాదు. అలా కాక మౌనం వహిస్తే అంతా రహస్యమే. మౌనమంటే కాయ మౌనమే గాదు. వాృఙ్మానమే కాదు. మనోమౌనం కూడా. జ్ఞానం జ్ఞానవతాం. జ్ఞానులైన వారందరిలో దాగి ఉన్న జ్ఞాన గుణమే నేను. లౌకికం దగ్గరి నుంచి అలౌకికం వరకూ జ్ఞాన శాఖలెన్ని ఉన్నాయో అన్నీ విశేష జ్ఞానాలని. వాటన్నిటినీ వ్యాపించిన సామాన్య జ్ఞాన మేది ఉందో అలాటి అద్వైత రూపమైన అధిష్ఠాన రూపమైన జ్ఞానాన్ని నేనని అర్ధం.

యచ్చాపి సర్వభూతానాం - బీజం త దహ మర్జున
న తదస్తీ వినాయత్స్యాత్ మయా భూతం చరా చరమ్ - 39


  అంతే కాదు. సకల భూతాలూ అంటే అవి చేతనాలే కావచ్చు. అచేతనాలే కావచ్చు. వాటన్నిటికీ బీజం మూల భూతమైన తత్త్వమేదో అది నేనే సుమా. అంతేగాక ఇంకా ఒకటుంది చివరిసారిగా నీవు

Page 338

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు