#


Index

విభూతి యోగము

ద్యూతం. పాచికలతో ఆడే ఆట జూదం. అది ఛలయతాం. మోసంగా ఆడే ఆటలన్నింటిలో అలాటి జూదమే నేనంటాడు. అలాగే తేజశ్శాలు లందరిలో తేజస్సు నేను. జయోవ్యవసాయః జయశీలురలో జయాన్ని నిశ్చయ స్వభావులలో నిశ్చయాన్ని. సత్త్వం - సత్త్వగుణ సంపన్నులలో సత్త్వాన్ని నేనే.

వృష్ఠీనాం వాసుదేవోస్మి - పాండవానాం ధనంజయః
మునీనా మ వ్యహం వ్యాసః - కవీనా ము శనా కవిః - 37


  యదు వృష్టి భోజాంధక కుకురు అనే అయిదు శాఖలలో వృష్టి శాఖలో జన్మించి దానికి ప్రధానుడైన వాసుదేవుణ్ణి నేను. పాండు కుమారు లయిదుగురిలో ధనంజయుడైన అర్జునుణ్ణి కూడా నేనే. మనన మౌన శీలురైన మహర్షులందరిలో వేదవ్యాసుణ్ణి నేనే. పోతే క్రాంత దర్శనులైన కవులందరిలో ఉశనుడనే పేరు గల వాడనూ నేనే. ఇక్కడ చూడండి. వాసుదేవుడూ అర్జునుడూ - వ్యాసుడూ ముగ్గురూ వచ్చారిక్కడ. వీరు ముగ్గురూ భారత పాత్రలే. అందులో వ్యాసుడు భారత రచయిత కూడా. ఆయనే వ్రాశాడు భగవద్గీత కూడా. తానే చెబుతున్నాడిప్పుడు వీరంతా భగవద్విభూతేనని. అంటే వీరు వీరుగా లేరు. భగవదుపాధులే వీరు. ప్రపంచమంతా విభూతే అన్నప్పుడు వీరు మాత్రం కాకపోతారా. భూత భవిష్యద్వర్తమానాల్లో కనిపించే ప్రతి ఒక్కటీ ప్రతి ఒక్కరూ భగవద్విభూతి శకలాలే. విభూతిగా ఉపాధులూ స్వరూపంగా భగవంతులే.

Page 337

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు