#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
జన్మమృత్యు
జరాగతిగః
ఏకాత్మ అన్నప్పుడు అనాత్మ కూడా ఆత్మే కాబట్టి ఇక జన్మ మరణాదులన్నిటికీ అతీతమైనదా ఆత్మ.
భూర్భువస్స్వస్తరుః
తారః
సవితా
ప్రపితామహః
తేజో బన్నాలనే మూడు వృక్షాలకూ బీజమా చైతన్యం. వాటిని ఛేదించి తరింపజేసేది అదే. అన్నిటినీ ప్రసవించి అన్నింటినీ పాలించే ప్రకృష్టమైన (మహః) తేజస్సదే.
యజ్ఞః
యజ్ఞ పతిః
యజ్వా
ఈ జీవితమనే యజ్ఞమూ, ఈ యజ్ఞానికి అధీపతీ, యాజకుడూ కూడా ఆ ఈశ్వరుడే.
యజ్ఞాంగః
యజ్ఞవాహనః
యజ్ఞోపకరణ సామగ్రీ- యజ్ఞఫలాన్ని మోసుకుపోయే అగ్నిహోత్రుడూ ఆయనే.
యజ్ఞభృత్
యజ్ఞకృత్
యజ్ఞకుండమూ యజ్ఞ కర్త యజమానుడు కూడా ఈశ్వరుడే.
యజ్ఞో
యజ్ఞభుక్
యజ్ఞ సాధనః
యజింపబడే దేవతా - యజ్ఞానుష్ఠానఫల భోక్తా - యజ్ఞాన్ని చేసే ప్రయత్నమూ - దానివిధానమూ కూడా ఈశ్వరుడే.
యజ్ఞాంతకృత్
యజ్ఞగుహ్యమ్
చివరకీ జీవిత మహాయజ్ఞాన్ని సమాప్తం చేసేవాడూ ఆయనే. ఇంతెందుకు. యజ్ఞారంభం నుంచి యజ్ఞాంతందాకా సర్వమూ ఈశ్వర చైతన్య విలాసమే. ఇదే ఈ యజ్ఞరహస్యం.
అన్నమ్
అన్నాద ఏవచ
తినబడేది అన్నం - తినేది అన్నాదం, అంటే చేయబడే యజ్ఞం చేసే యజ్వ - జీవ జగత్తులని భావం. ఇవి రెండూ పరమాత్మ అంశాలే. అలాంటప్పుడిక ద్వైత ప్రపంచమెక్కడ ఉంది. ఉన్నదంతా ఈశ్వర స్వరూపమే.

Page 65

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు