#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
స్వాస్యః
ప్రాగ్వంశః
వంశవర్ధనః
స్వ ఆస్య - దాన్ని అదే కబళిస్తుంది. అన్నమూ అన్నాదుడూ అదే గనుక. దాని వంశమైన ఈ సంసార మతి పురాతనం. ఈ వంశాన్ని పెంచేదీ అదే (వర్ధన) మరలా త్రుంచేదీ (వర్ధన) అదే.
భారభృత్
కథితః
ఈ సమస్త భారమూ అదే వహిస్తున్నది. శబ్ద ప్రపంచమంతా చెప్పే (కథిత) ఏకైకమైన అర్థమది.
యోగీ
యోగీశః
సర్వకామదః
శబ్దరూపమైన సృష్టితో ఓతప్రోతమై ఉన్నదా అర్థం. అలా ఉండి కూడా దీని కీశం అతీతమైనది. ఈ రహస్యాన్ని గుర్తిస్తే మరి దేనిమీదా కామం లేకుండా (ద) ఖండించి వేసేది అదే.
ఆశ్రమః
శ్రమణః
క్షామః
ఖండించి సంసార శ్రమను పూర్తిగా రూపుమాపేది అదే. అందు కోసమే ఈ జీవుడు యావజ్జీవం శ్రమించవలసింది. అదీ ఎంతో (క్షమ) సహనంతో సాగించవలసి ఉంటుందా శ్రమ.
సుపర్ణః
వాయువాహనః
అభ్యాస వైరాగ్యాలనే పర్ణాలు గల ఈ మనస్సునూ నిత్యమూ రాకపోకలు చేసే ఈ ప్రాణ వాయువునూ అందుకోసమే మనకు సాధనాలుగా ప్రసాదించాడా పరమాత్మ.
ధనుర్థరః
ధనుర్వేదః
దండః
దమయితా
దమః
మనః ప్రాణాలనే సూక్ష్మశరీరంతో స్థూలమైన ఈ ధనుస్సును (దేహాన్ని) ధరించాము మనం. మరలా ఈ ధనుస్సు ద్వారానే దాన్ని (వేద) అందుకోవలసి ఉంది. అలా అందుకోటానికి సహాయంగా (దండ) శాస్త్రాన్నీ (దమయితా) శాసకుడైన గురువునూ (దమ) దానికి తగిన శిక్షణనూ మనకు సమకూర్చాడు జీవితంలో. అలాంటి శిక్షణనందుకొంటే జీవితంలో పరాజయం కలగదు.
అపరాజితః
సర్వసహః
అన్ని విఘ్నాలనూ ఎదిరించి నిలవగలడు.

Page 59

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు