#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
అనామయః (ఆమయం) వ్యాధి తొలగిపోయి స్వస్థత చేకూరుతుంది.
మనోజవః
తీర్థకరః
వసురేతాః
వసుప్రదః
వసుప్రదః
మనోవేగంతో పట్టుకోవాలి సాధకుడు దాన్ని. అప్పుడే వాణ్ణి తీర్ణుణ్ణి చేస్తుందది. మంచి వీర్యాన్ని ప్రసాదిస్తుంది. రేతస్సంటే వీర్యమనే అర్థం. ఆత్మజ్ఞతే వీర్యం. అది సంక్రమించిన వాడి కిహంలో భోగమూ ఇస్తుందది. పరంలో మోక్షమూ ఇస్తుంది.
వాసుదేవః
వసుః
వసుమనాః
హవిః
వసతి-దీవ్యతి, సచ్చిదాత్మకమైన తత్త్వమది. అదే ప్రపంచ మంతటా (వసు) వసిస్తున్నది. మానవుడి మనసులోనూ అదే. ఎటు వచ్చీ ఈ సచ్చి ద్విశేషరూపంగా కనిపించే సృష్టినంతా దానిలో హోమం చేయగలగాలి మనం.
సద్గతిః
సత్కృతిః
సత్సామాన్యమే సద్విశేషాలన్నింటికీ గతి సముద్రం తరంగాదులకు లాగా మరలా సముద్రమే తరంగ రూపంగా మారినట్టు ఆ సామాన్యమే విశేషసృష్టి చేస్తున్నది.
సత్తా
సద్భూతిః
సత్పరాయణః
అలా చేస్తున్నా మరలా అది సత్తా రూపమే. అంతకన్నా విశేష మేమీ లేదు. విశేషంగా కనిపించేదంతా ఆ సద్విభూతే, అది దానికి పరాయణం. లయ స్థానం.
శూరసేనః
యదుశ్రేష్ఠః
సన్నివాసః
సుయామునః
శూరుని వంశంలో పుట్టి యదుశ్రేష్ఠుడైన కృష్ణుడదే. సాధకులే ఆయన సేన. వాడే శూరసేనుడు. యదు శ్రేష్ఠ ఏదేది శ్రేష్ఠమంటున్నామో దానికంతటికీ శ్రేష్ఠమని అర్థం. సత్ వివేకవంతులే దానికి నివాసం. (యమ-జంట) జీవేశ్వరులనే (యమున) జంటలో (సు) శ్రేష్ఠమైన ఈశ్వర తత్త్వమది.
భూతావాసః
వాసుదేవః
సర్వాసునిలయః
చరాచరభూతాలూ ఆ వాసమే భూతాలకూ అది ఆవాసమే. ఎప్పుడూ ఆరని (వాసు) తేజస్సది (దేవ). అందరిలో ప్రాణశక్తి (అసు) రూపంలో లీనమయి (నిలయ) ఉన్నది.

Page 51

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు