#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము

ఉపశ్రుతి

సహస్ర నామాలు ఎన్నో ఉన్నాయి సంస్కృత వాఙ్మయంలో, కాని అన్నీ ప్రాచీనమైనవి కావు. ప్రాచీనమనే పేరుతో చెలామణి అవుతున్న అర్వాచీన రచనలు, పోతే నిజంగా ప్రాచీనమైన స్తోత్రాలు కొన్ని మాత్రమే. వాటిలో చాలా ప్రసిద్ధమైనవీ ఎంతో ప్రధానమైనవీ రెండే రెండు. లలితా సహస్రనామమొకటి, విష్ణు సహస్రనామ మొకటి. ఇందులో లలితా సహస్రం బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడగస్త్యుడికి బోధించినదైతే విష్ణు సహస్రం మహాభారతంలో భీష్ముడు ధర్మరాజు కుపదేశించింది. మొత్తంమీద రెండూ వ్యాసప్రోక్తమైనవే, సందేహంలేదు.

  అయితే మహర్షి ఒకటి స్త్రీ దేవతాపరంగా మరొకటి పురుషదేవతా పరంగా వ్రాయటంలో ఏమిటాయన అభిప్రాయం. దేవతలో స్త్రీ పురుష భేదముందనా కాదు. ఆ మాటకు వస్తే 'నైవస్త్రీ నపుమానేష నైవ చాయం నపుంసకః' అని ఉపనిషత్తు చాటుతున్నది. అది స్త్రీ గాదు పురుష గాదా పరతత్త్వం. ఉపాధి భేదాన్ని బట్టి మనం కల్పించుకొన్న మూర్తులివి. నామ రూపాద్యుపాధుల వల్లనే అమూర్తమైన తత్త్వం మూర్తమై కనబడుతుంది. ఎందుకీ కల్పన అంటే సాధకుల కది ఒక ఆలంబనం. సాధకు డుపాసకుడైతే వాడి అభిరుచిని బట్టి శక్తిరూపంగానో శివరూపంగానో ఆరాధిస్తూ పోతాడా తత్త్వాన్ని,

Page 3

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు