నామం | అంతరార్థము |
---|---|
వరారోహః మహాతపాః |
శ్రేష్ఠమైన ఆరోహణమది సాధకులకు. అది కూడా గొప్ప తపస్సు. ఆలోచన చేసి ఆరోహించవలసిన స్థానం. అది అసలు తపస్స్వరూపం - యస్యజ్ఞానమయం తపః |
సర్వగః సర్వవిద్భానుః |
ప్రజ్ఞానం గనుక అది సర్వగతం అంతటా వ్యాపిస్తుంది. సర్వవిద్ అన్నిటినీ గ్రహిస్తుంది. భాను-తాను భాసిస్తుంది. అన్నిటినీ భాసింపజేస్తుంది. |
విష్వక్సేనః జనార్దనః |
చరాచరజగత్తంతా దాని సైన్యమే. విశ్వక్-అంతటా అదే. అందుకే జనులందరూ అర్ధన కోరవలసిందేదో గాదు. అదే. |
వేదః వేదవిద్ అవ్యంగః |
వేదమంటే జ్ఞానం. జ్ఞానమూ అదే, వేదవిద్, జ్ఞానాన్ని గ్రహించే జ్ఞాతా అదే. అవి+అంగ, విశేషించి ఏ శరీరంతోనూ సాంగత్యం లేదు దానికి. |
వేదాంగః | ఉంటే దానికొక్కటే శరీరం - అది జ్ఞానమే. |
వేదవిత్ కవిః |
ఈ వేదం - ఈ జ్ఞానం చేతనే వింద్- అందుకోవాలి దాన్ని, అది కవి. క్రాంతదర్శి. దీనికతీతంగా ఉండి దీన్ని గమనిస్తున్నది. |
లోకాధ్యక్షః సురాధ్యక్షః ధర్మాధ్యక్షః కృతాకృతః |
లోకులందరినీ చూస్తున్నది. విశేషంగా సాధకులను (సుర) గమనిస్తున్నది, వారు చేసే ధర్మకార్యాలూ దర్శిస్తున్నది. కృతా కృత. ఎవరు చేశారా చేయలేదా చేస్తే ఎంతవరకు చేశారా-ఇదీ కనిపెట్టి చూస్తేనే ఉన్నది. |
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః |
బ్రహ్మ-విష్ణు-రుద్ర-ఈశ్వర అని నాలుగు రూపాలు. వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అని నాలుగు వ్యూహాలు-పరా పశ్యంతీ మధ్యమా వైఖరులనే నాలుగు దంష్ట్రలలాటి శక్తి ప్రసారాలూ - ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యాలనే నాలుగు సిద్ధులూ గల విశ్వరూపుడా పరమాత్మ. |
Page 18