#


Index

అపరోక్తము

శ్రీ సూక్తాదులు మూడింటికీ శ్రీకారం చుట్టి ప్రారంభించాము. ప్రస్తుతం వాటికి మరలా ఒక శ్రీకారం చుట్టి ముగించటం మన ధర్మం. మూడింటికీ ఏమిటి సంబంధం. శ్రీని పట్టుకొని పోతే అది పురుషుణ్ణి చూపుతుంది. ఆ పురుష తత్త్వాన్ని మననం చేస్తే అది మంత్రమై పుష్పంలాగా ఉన్న మన మనస్సును వికసింప జేసి ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇదీ వీటి మూడింటికీ ఉన్న ఆంతరంగిక సంబంధం. అది బయట పెట్టటమే వ్యాఖ్యాతగా నా కర్తవ్యం. అది నేనెంత వరకు సాధించగలిగానో మీరే చెప్పాలి నాకు.

కాని ఒక్క విషయం. నా వివక్షిత మంతా నేను వ్రాసే ఉపోద్ఘా తోప సంహారాలలో నిక్షిప్త మయి ఉంటుంది. గ్రంథం మాట అలా ఉంచి దాని ఆద్యంతాలలో నేను వ్రాసిన మాటలు చక్కగా పరిశీలించి

Page 173