కర్మ యోగము
భగవద్గీత
మార్గమని నమ్ముతున్నారు. అలాంటి వారి బుద్ధిని ప్రక్కకు త్రిప్పటానికి ప్రయత్నించవద్దు. ప్రయత్నించినా దానివల్ల ప్రయోజనం లేదు. ఎప్పటికీ మారరు వారు.
జోషయే త్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః - వారేది పట్టుకొని చేస్తుంటే అదే భేష్ అలాగే చేస్తూపో అదే మంచిదని ఆమోదించటం మంచిది. నీవు జ్ఞానివే గదా. అది నీవరకే ఉంచుకో. ఆ జ్ఞానం అక్కరలేని వాడి మీద అది బలవంతంగా వేసి రుద్దవద్దు. కొంతకాలానికి ప్రాప్తముంటే వాడికే బుద్ధి మారుతుంది. అప్పుడు నీ బోధ వినటానికి వాడే నీ దగ్గరికి పరుగెత్తి వస్తాడు. ఆకలి లేనివాడి కన్నం పెట్టి ఏమి సుఖం. అలా చేస్తే రెండు నష్టాలు. చెవిటి వాడికి శంఖూదినట్టు నీ జ్ఞాన బోధకు విలువ లేకుండా పోవటమొకటి. వాడేమిటా ఏవేవో చెప్పి నన్ను పెడదోవ పట్టిస్తున్నాడే వీడని నీమీద కారాలు మిరియాలు నూరటమొకటి. కన్నుపోయే కాటుక పెట్టుకోట మెప్పుడూ పనికిరాదు.
ఇదీ ఎంతో గొప్ప ఉపదేశం గీతలో. ఇది ఈనాడు మత ప్రచారం ధర్మప్రచారం చేయటం ఒక ఫాషనుగా పెట్టుకొని సతమతమయ్యే ప్రతి ప్రచారకుడికీ పెద్ద హెచ్చరిక. ప్రచారం కాదు మనకు కావలసింది. విచారం. విచారం లేని ప్రచారం పునాది లేని కట్టడం లాంటిది. ఎప్పటికీ నిలవదు.
ప్రకృతేః క్రియమాణాని - గుణైః కర్మాణి సర్వశః
అహంకార విమూఢాత్మా - కర్తాహ మితి మన్యతే - 27
తత్త్వవిత్తు మహాబాహో - గుణకర్మ విభాగయోః
గుణా గుణేషు వర్తంత- ఇతి మత్వాన సజ్జతే - 28
Page 250