#


Index

10. ఉత్తరంబున సమా యత్తమై కచ్చెకు కాలు ద్రవ్వెడు చమూజాల మొకటి పంచ బంగాళమౌ ప్రాగ్ది శాభ్యంతర ప్రాంత మందలి యీతి బాధ యొకటి పశ్చిమంబున యజ్ఞపశు సమాన వధైక పారీణమగు చిక్కు ప్రశ్న యొకటి ఇది లంకయను మాట కెనయౌచు దక్షిణా శను సాగు రాక్షస చర్య యొకటి.

11. ఒకటి యననేల ఒక్కొక్క టకట వికట కూట పర్వత కోటి శృంగాటకమున నిలిపి జాతిని - నిలువున ఒలిచి తొలిచి కలచి వైచుట చూడమే కన్ను లార.

12. మానము ప్రాణముంగొను అమానుష కృత్యము లెల్ల గొప్పవి జ్ఞానము జాతి నీతి యను జాడ దలం పని ఆత్మకార్య సం ధానమె ధ్యేయ - మైన మన నాగరి కత్వము పాల్య పాలక స్థానము లందు రెండిటను సాగెడు నిప్పు - డ పక్ష పాతియై

13. ఇట్టి యెడ - నేమి స్వాతంత్య్ర - మేమి శాంతి ఏమి యుత్సవ - ముత్సాహ మేమిటనెడు మాట యును లేక పోదు ముమ్మాటి కిపుడు మాన సంబుల నెంతటి మౌనికైన

14. ఐనను రాకపోవ దసుఖాంత కరంబగు వేళ - దుర్దశా ధీన విదీనయైన భరతేందిర వెండియు మందహాసర మ్యాననగాక పోవ - దను నాశ ఫలించెడుఁగాక - ఈరవీం ద్రానన భారతీ ధ్వనితమై - హితమై - సతతోపభోగ్యమై

Page 11