భౌతికమెలా అవుతుంది. అనుభవమన్నప్పు డది బంధమైనా మానసికమే. మోక్షమైనా మానసికమే. అయితే బంధం సవికల్పమైన మనస్సు అనుభవిస్తే మోక్షం నిర్వికల్పమైన మనస్సనుభ విస్తుంది. నిర్వి కల్పమైన ఆత్మ స్వరూపాన్ని దర్శించి నప్పుడు మనస్సు నిర్వికల్పమే కావలసి ఉంది. అలాగే అయిందో ఇక అది మనస్సే గాదు. ఆత్మ స్వరూపమే. అంతా ఆత్మేననే దృష్టి ఏర్పడినప్పుడిక అనాత్మ ప్రపంచమే లేదు. ఇలాటి సర్వాత్మ భావాన్నే మన కుపదేశిస్తున్నది భగవద్గీత. అలాగే జీవించ మని కూడా బోధిస్తున్నది. ఇంతకన్నా గొప్ప బోధ ఏమున్నది. గీతా సారమిదే. ఉపనిషత్తుల దగ్గరి నుంచి బ్రహ్మ సూత్రాల దగ్గరి నుంచి భగవద్గీత వరకు శ్రవణ మనన నిది ధ్యాసనా రూపంగా ప్రస్థాన త్రయం మనకు చేస్తూ వచ్చిన జీవిత సందేశ సారమిదే.
ఓం
శాంతిః శాంతిః శాంతిః
End