#


Index

ప్రస్థానత్రయ సారము

  నైవకించిత్కరోమీతి. అప్పుడే పని చేస్తున్నా -శాస్త్రీయమే గాదు లౌకికమే గాదు. నేనుగా ఏమీ చేయటం లేదు. ప్రకృతి గుణాలే దాని గుణాలతో సాంగత్యం పెట్టుకుంటున్నదని సాక్షిగా చూడటం అలవడుతుంది. మనస్సుతోనే వదులకోవా లేదైనా. శరీరంతో కాదు. అసలు ఏ జీవికీ కర్మలనీ కర్తృత్వమనీ సృష్టించ లేదీశ్వరుడు. స్వభావస్తు ప్రవర్తతే. త్రిగుణాత్మకమైన మాయాశక్తే వాటిని తెచ్చి పెట్టింది. సహజం కాదిది. ఆగంతుకం. కనుక సహజమైన మన ఆత్మ స్వరూపం మనమర్థం చేసుకొంటే చాలు. ఏ గొడవా లేదు. రాగద్వేషాలూ సుఖదుఃఖాలూ -ద్వంద్వాలన్నీ ఎగిరిపోతాయి. బ్రతికుండగానే సృష్టి రహస్యం భేదించగలడు మానవుడు. అదేదో గాదు. ఎప్పుడూ సామ్యావస్థలో Eaqui Poise మనస్సు నిలిచి ఉండటమే ఏకైకమైన సాధనం. ఒక సద్ర్భాహ్మణుడి దగ్గరి నుంచీ కసాయివాడి వరకూ అందరిలో ఉన్నదొకే ఒక బ్రహ్మతత్త్వం గదా అనేది సమదృష్టికి పరాకాష్ఠ.

Page 44

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు