దండలు ఒడ్డాణాలు దాని విభూతి లేదా విస్తారం. దీనికే సంస్థానమని పేరు పెట్టారు భగవత్పాదులు. సువర్ణ సంస్థాన మాభరణాలయినట్టే సత్సంస్థానమే constitution ఈ ప్రపంచం.
మరి ద్వైతులు కూడా ఈశ్వర కారణవాదులే గదా.
వారిని కాదనటం దేనికని ప్రశ్న. వారు ఈశ్వరుణ్ణి
నిమిత్తంగానే ఒప్పుకొంటారు గాని ఉపాదానంగా ఒప్పుకోరు.
అలాంటప్పుడా ఈశ్వరుడింత విషమంగా నిర్దాక్షిణ్యంగా
సృష్టి ఎందుకు చేశాడని ప్రశ్న వస్తుంది. అంతేగాక కర్తృత్వం
చెప్పినప్పుడు భోక్తృత్వం కూడా ఈశ్వరుడికే చెప్పవలసి
వస్తుంది. అప్పుడిక జీవుడికి లేవు బంధ మోక్షాలు. ఈశ్వరుడి
మెడకే చుట్టుకుంటాయి. ఉపాదానం కూడా ఈశ్వరుడే
అయితే ఈ ప్రమాదం లేదు. ఎందుకంటే జీవజగత్తులు
కూడా ఈశ్వర చైతన్యమే వ్యాపిస్తుంది. వ్యాపిస్తే జీవజగత్తులు
వాస్తవం కాక ఆభాస అవుతాయి. అప్పుడిక బంధ మోక్షాలు
జీవుడికి చెప్పినా అవీ ఆ భాసే వాస్తవం కావు. కనుక
కార్యకారణాల కెలాటి విరోధమూ కాదు. రెండూ ఒకే ఒక
స్వరూపమవుతాయి. అయితే అవిరోధమే.
Page 31