#


Index

ప్రస్థానత్రయ సారము

  ఇప్పుడీ అవస్థాత్రయం దాటిపోతే గాని తురీయమనే అవస్థ Fourth Dimension. నందు కోలేము. అదే సమాధి అదే మోక్షం. అప్పుడీ మాత్రలూ పాదాలూ ఏమవుతాయి. అవి మనం తురీయ స్థితి నర్థం చేసుకోటానికి కల్పించుకొన్న సంకేతాలే. కాబట్టి ఆ స్థితి నందుకొన్న మరుక్షణం అందులో లయమయి పోతాయి. అప్పుడా దశ అమాత్ర మనీ అపాదమనీ - మాత్రా పాదాలుగా కనపడేవి రెండూ కలిసి ఏకమయి పోతాయని ఉపనిషత్తు. -వర్ణిస్తుంది ఈ మాండూక్యమనే

  దానితో చతుర్ధం శివ మద్వైతం - తురీయమనే ఈ నాలుగవ దశ మానవుణ్ణి శవం గాకుండా శివంగా మారుస్తుంది. కారణమది అద్వైతం. అందులో జనన మరణాది భేదం లేదు. స విజ్ఞేయః దాన్నే ఎప్పటికైనా అనుభవానికి తెచ్చుకోవాలి సాధకుడు. అది ఎలాగా అని అడిగితే ఏకాత్మ ప్రత్యయసారం అన్ని దశలలోనూ ఉన్నదొకే ఒక ఆత్మ చైతన్యమనే అఖండాత్మ భావనే మనకు ప్రమాణం Instrument of Knowledge. దానితోనే పట్టుకోవాలా తురీ యావస్థనని బోధిస్తున్నది మనకు మాండూక్యం.

Page 19

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు