#


Index

ప్రస్థానత్రయ సారము

భావాన్ని భావిస్తూ పోతే ఈ శరీరంలో నుంచి బయటికి వచ్చి బ్రతికుండగానే మన మమృతత్వాన్ని పొందగల మంటుందుపనిషత్తు. మృతులమై కూడా అమృతులమే మనం. భౌతికంగా మృతులం. ఆధ్యాత్మికంగా . Immortal.

  ఈ గొప్ప భావాన్నే ఒక కథ ద్వారా బయట పెట్టిందుపనిషత్తు. కథలన్నీ సత్యాన్ని బోధించే సంకేతాలు symbols మాత్రమే. సత్యం పరమాత్మ. అది ఏమిటో అగ్నికీ వాయువుకూ అర్థం కాలేదట. అంటే మనస్సుకూ ప్రాణానికని అర్థం. ఆ మనః ప్రాణాలు దేని కుపాధులో అలాటి జీవచైతన్యమే దేవేంద్రుడు. దానికి కూడా ప్రయత్నం లేకుండా అనుభవానికి రాలేదది. అందుకే ఇంద్రుడు కూడా కళ్లు మూసుకొని ధ్యానించవలసి వచ్చింది. అప్పు డుమా రూపంగా ఒక దేవత సాక్షాత్కరించి అతనికి మార్గం చూపింది. అది మనసులో కలిగే బ్రహ్మాకార వృత్తి The Idea of the Reality. అదే ప్రమాణం బ్రహ్మమనే ప్రమేయాన్ని చూడటాని కని ఉపనిషత్తు సందేశం.

Page 12

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు