కేనేషితంపతతి మనసు దగ్గరి నుంచీ మన ఈ శరీరమనే ఉపాధి ఏమి. దీనికి బాహ్యంగా చూచే ఈ చరా చర ప్రపంచమేమి -ఇవి రెండూ ఇలా కనిపిస్తున్నాయంటే వీటి వెనకాల చేరి నడుపుతున్న దొక దివ్యశక్తి. అది వీటిలాగా అపరిపూర్ణం కాదు. పరిపూర్ణమైన జ్ఞానం. పరిపూర్ణమైన శక్తి. అదే ఈశ్వరుడు. అది లేకపోతే ఇవి లేవు. అంతే కాదు. నిరాకారమైన అదే తన శక్తి ప్రభావం చేత సాకారమైన ఈ పిండాండ బ్రహ్మాండాల రూపంలో గోచరిస్తున్నది.
అది మన మర్ధం చేసుకోవాలంటే కేవలం దీన్ని మాత్రమే చూస్తూ దీనితోనే వ్యవహరిస్తూ పోతే సరిపోదు. మన ప్రతి ఆలోచనలో - ప్రతి మాటలో ప్రతి చేష్టలో ఈ విశేషాలన్నింటిలో పరుచుకొని ఉన్న ఆ సామాన్య -స్వరూపాన్నే Universal దర్శిస్తూ పోవాలి. కంటితో గాదు. మనస్సుతో. నిరాకారం గదా. ఎలా చూడటమని ఆశ్చర్యపడ నక్కరలేదు. నిరాకారమైన ఆకాశాన్ని ఎలా చూస్తున్నావు నీవు. పోతే సుఖమూ దుఃఖమూ భయమూ ఉత్సాహమనే భావాలకు కూడా ఒక ఆకారమంటూ లేదు గదా. వాటినెలా అనుభవించ గలిగావు. అలాగే చూడవచ్చు. చూచే అవకాశ మెంతైనా ఉంది.
Page 10