#


Back

Page 91

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


91
సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః ।
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి ॥ 5-6 ॥

దీనిని బట్టి ఎప్పటికైనా సాధకుడు కర్మలను సన్యసించ వలసిందే! లేకుంటే జ్ఞానమబ్బినా అది నిష్టగా పరిణమించదు. నిష్టలేకుంటే ముక్తిలేదు. కాబట్టి జ్ఞానో దయమైన. తరువాత అ సర్వకాల సర్వావస్థలలో నిలబడడానికి కర్మలను సన్యసించక తప్పదు.

అయితే ఎటువచ్చీ అది ఉదయించటానికి పూర్వమే తొందరపడి వీటిని మనం వదులుకోరాదు. వదిలితే జ్ఞాన మార్జించటాని కసలు మార్గమే లేదని చెప్పాము. కాని కొందరి విషయంలో కర్మలేవీ చేయకుండానే బాల్యంలోనే సన్యసించినట్టు మనకు కనబడవచ్చు. వారు కారణ జన్ములు ఇంతకు ముందు జన్మలలోనే ఆ కర్మాను ష్టానం జరిగిపోయి ఉంటుంది వారికి.

మొత్తంమీద కర్మవల్లనే జ్ఞానం. అది .ఉపాయం Means ఇది దాని, కుపేయం End. ఉపాయం లేకుండా ఉపేయం మనకెలా లభిస్తుంది. అందుకే యోగ యుక్తుడయితే సాధకుడు మనన శీలుడవుతాడు. ఆ మననంతో వెంటనే బ్రహ్మాన్ని అందుకొంటాడు.

మనన మేమిటి. బ్రహ్మమేమిటి. ఆత్మజ్ఞానమే మననం. అది కర్మయోగం వల్లనేప్రాప్తిస్తుంది మనకు. ఆజ్ఞానం మరలా కర్మసన్యాసం ద్వారా జ్ఞాననిష్టగా మారుతుంది. బ్రహ్మమంటే ఈజ్ఞాననిష్ట-మరేదీగాదు. ఇంతకూ వివక్షిత మేమంటే మోక్షానికి మార్గమొక్కటే-రెండులేవు. అది జ్ఞానమే. పోతే కర్మ లేదా యోగమనేది ఆ మార్గంలో మజిలీ మాత్రమే స్వతంత్రమైన వేరొకమార్గంకాదు. ఇక్కడ చాలామంది మతాచార్యులే బోల్తాపడ్డారు. సాధకుడి విషయంలో చాలా జాగరూకుడయి ఉండాలి. లేకుంటే రెంటినీ సమన్వయించుకోలేక సాధన దెబ్బతింటుంది.