#


Back

Page 90

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


90
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ॥ 6-3 ॥

ఇంత వరకూ జరిగిన మీమాంస కంతటికీ ఏమిటి పండి తార్ధం కర్మ-జ్ఞానం ఈ రెండింటికీ. పైకి చూస్తే ఏదో వైరుధ్య మున్నట్లు కనిపిస్తుందేగాని ఆంతర్యంలో అలాంటి దేమీలేదు. మోక్ష మనేది గమ్యమనుకొంటే జ్ఞానం దానికి సాక్షాత్సాధనం. పోతేకర్మ సాక్షాత్తుగాకాదు గాని జ్ఞానంద్వారా సాధనం. అంటే కర్మ జ్ఞానానికి దారితీస్తే ఆ జ్ఞానం మోక్ష ఫలాన్ని ప్రాసాదిస్తుంది మనకు.

అంచేత గీత మనకిచ్చే సలహా ఏమంటే జ్ఞానం కలిగేదాకా కర్మ వదిలేయ రాదు. వదిలేస్తే జ్ఞానోదయానికి మార్గంలేదు. జపతపాలలాంటి యజ్ఞయాగాల లాంటి విధులు కాకపోయినా జ్ఞానార్దనకు తోడ్చడే కర్మ సమాధి భక్తియోగాలైనా ఆచరించవలసిందే గదా. ఆ మూటినీ కలిపి చెప్పే ఒక్కమాటే కర్మ అంటే. ఇలాంటి కర్మ లేదా యోగమనేది జ్ఞానం కలిగే దాకా సాగించవలసిందే తప్పదు.

పోతే జ్ఞానమనే ఫలం మనచేతి కెప్పుడందిందో ఇక కర్మకు ప్రమేయంలేదు. కాబట్టి జ్ఞానప్రాప్తి అనంతర మిక సాధకుడు దాన్ని పరిత్యజించ వలసి ఉంటుంది. జ్ఞాన మబ్బేవరకూ వాడారురుక్షుడు. అంటే పర్వత శిఖర మెక్కినట్టు ఎక్కుతూ ఉంటాడు. అబ్బిన తరువాత ఇక ఆరు రుక్షువు కాదు ఆరూఢుడు. అంటే శిఖరం మీద పాదం నిలిపినవాడు. నిలపితే ఇక పైకిపోయే ప్రసక్తి ఏముంది. కనుక మరి చేయవలసిన కర్మ అంటూ ఏదీలేదు. ఏదీ లేదంటే శాస్రీయమైనవీ లౌకికమైనవీ కూడానని అర్థం. శారీరకమైనకర్మ మాత్ర మప్పుడూ ఉంటుంది. దానిని మాత్రం విడవటానికి వీలులేదు. అది ప్రారబ్దంతో జరిగేదికాబట్టి బ్రహ్మానుభవానికి ప్రతి బంధకం కాదు. అంతకుమించి చేసిందంతా ప్రతిబంధకమే. అంచేత శమమే అప్పుడనుసరించ వలసిన మార్గం. శమమంటే కర్మలనుంచి విరమణ.