#


Back

Page 80

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


80
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ॥ 3-28 ॥

తత్త్వజ్ఞుడు మాత్రమలా ఎప్పటికీ మూఢుడు కాడు. ప్రకృతి గుణాలేమిటో అవి చేస్తూ ఉన్న పను లేమిటో ప్రతి క్షణమూ అద్దంలో కనపడ్డట్టు కనపడుతుంటాయి. ఒక అద్దం లాగానే వాడి బుద్ది నిత్యమూ వాటికి సాక్షిగా నిలిచి చూస్తూ ఉంటుంది. ఒకటి అద్దంలోనే ఉన్నట్టు కనిపించినా అది అద్దానికి బాహ్యామే. దాని నెప్పుడూ. ఆ ప్రతి బింబ మంట బోదు. అలాగే సర్వత్రా పరచుకొని ఉన్న తన ఆత్మలోనే జరగవచ్చు ప్రతి ఒక్క పనీ. అలా జరిగినా ఆ రూపాలుగానీ వ్యవహారం గానీ-శుద్ధమైన అతని ఆత్మ చైతన్యాన్ని ఏ మాత్రమా అంటదు.

ఇందులో ఉన్న చమత్కార మేమంటే పనులు చేసేవీ ప్రకృతి గుణాలే. పనులూ ప్రకృతి గుణాలే. గుణాలే గుణాలతో లావాదేవీ. పెట్టుకొని సతమతమవుతున్నాయి నిత్యమూ. గుణా లంటే అహంకారమూ-మనసూ-ప్రాణమూ -వీటి దగ్గర నుంచీ గుణాలే. తానో వీటికి కూడ అతీతమయిన ఆత్మ చైతన్యం. అది నిర్గుణం కాబట్టి ఆకాశంలాగా కదిలేది కాదు. చేసేదికొాదు కనుకనే చలనాత్మక మయిన కర్మదాని నంటదని చెప్పటం. ఇలాంటి సత్యం తెలిసిన తత్త్వవేత్త కర్మబంధంలో ఎప్పుడూ చిక్కడు. కర్మ అనే కబంధ హస్తాల నుంచి ఎప్పుడూ వాడు ముక్తుడే. '