#


Back

Page 39

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


39
స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే ।
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్ ॥ 7-22 ॥

పరమేశ్వరు డనుగ్రహించిన ఆ శ్రద్దా పాటవంతో వాడు తన ఆరాధన సాగిస్తాడు. ఆ ఆరాధన మూలంగా వాడు కోరిన కోరికలు కూడ ఫలిస్తాయి. అందుకు కారణం తానారాధిస్తూ వచ్చిన ఆ దేవతా మూర్తేనని వాడు భావించ వచ్చు. అది కేవలం పొరబాటు. కారణమేమంటే దేవతలందరూ పరమేశ్వరుని బంట్లు. ఈశ్వర ప్రేరణ లేకుండా ఏ దేవత గానీ స్వతంత్రంగా అనుగ్రహం చూపలేదు. పరిపూర్ణ శక్తి సంపన్ను డీశ్వరుడు. తద్విభూతి శకలాలే ఈ దేవతలు. ఈశ్వరుని కాదని సాధకుడిని అనుగ్రహించే శక్తి వాటి కెక్కడిది. కాబట్టి ఒక సాధకుడి మనోరథ మేదైనా నెరవేరు తున్నదంటే అది ఆయా దేవతల వల్లనని కాదు. మరిదేని వల్ల. ఆ దేవతల ద్వారా పరమేశ్వరుదే మన కదినెరవేరుస్తాడని అర్దం. ఇంతకూ సర్వసమర్థుదైన పరమేశ్వరుడు ఫలదాత అయితే దానికొక ప్రణాళిక Channel మాత్రమే ఆ దేవత.