#


Back

Page 37

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


37
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః ।
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ॥ 7-20 ॥

ఇలాంటి ప్రబోధాన్ని అందుకొని అలాంటి అఖండ జ్ఞానాన్ని అనుభూతికి తెచ్చెకోటానికెంతో సుకృతం చేసి ఉండాలి. లేకుంటే మనం చేసిన దుష్కృత మెలాగూ ఉండనే ఉన్నది. అది ఊరక ఉండేది కాదు. అనుక్షణమూ కామాన్ని రెచ్చగొడుతుంది. ఆ కామ భుజంగం సహస్ర ఫణాలు విప్పి మన జ్ఞానాన్ని కబళిస్తుంది. దానితో మనకు సర్వమూ వాసు దేవుడనే బుద్ధి నశిస్తుంది. ఒకే ఒక తత్త్వాన్ని భిన్న భిన్న రూపాలుగా దర్శిస్తాము. ఒక్కొక్క రూపాని కొక్కొక్క దేవత అని నామ కరణం చేస్తాము. ఆ దేవతల నడిగి కోరికలన్నీ తీర్చుకోవాలని తాపత్రయ పడతాము.

అయితే ఈ దేవతో పాసన కూడా అంత సులభం కాదు. ఒక్కొక్క దాని కెన్నో నియమాలూ నిష్టలు ఉంటాయి. ఉన్నా ఫరవాలేదు. ఫలకామన బలంగా ఉండడం మూలాన ఆశ్లేశం కూడా వహిస్తాడు మానవుడు. ఈ సహన శక్తి అతడికి సహజంగా ఉన్న ప్రకృతే నేర్పుతుంది.