#


Back

Page 33

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


33
బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 7-11 ॥

అసలు రహస్య మేమంటే ఎవరు నన్నెలా భజిస్తారో నేను కూడా వారి నలాగే భజిస్తుంటాను. ఎలా భజిస్తారో అని చెప్పటంలో ఎంతైనా ఉంది భావం. దేవుడెక్కడ ఉన్నాడు -లేడు పొమ్మని-వాదించే పరమ నాస్తికుడి దగ్గరి నుంచీ - ఎక్కడబడితే అక్కడ ఉన్నాడది మన స్వరూవపమేనని అనుభవానికి తెచ్చుకొనే మహాజ్ఞాని వరకూ అందరూ ఆ పరమాత్మను భజిస్తున్నవారే. అందుకే మానవు లంతా ఏదో ఒక విధంగా చివరకునా మార్గాన్నే అనుసరిస్తున్నారని నిర్భయంగా చాటుతున్నాడు భగవానుడు.

అందరూ ఆయన మార్గాన్నే అనుసరించట మేమిటి. నాస్తికులూ Atheits అజ్జేయ వాదులూ Agnostics హేతువాదులూ Rationalists వందలు వేలు న్నారు గదా లోకంలో. వారెవరూ ఈశ్వరాస్తిత్వాన్ని ఒప్పుకోరు గదా అని ప్రశ్నరా వచ్చు. ఒప్పుకోనట్టు పైకి కనిపిస్తున్నా ఒక విధంగా వారూ భజిస్తూనే ఉన్నారా పరమాత్మను. ఎలాగంటే మనుష్య మానవ అనే మాటలకు మనన శీలుడని అర్ధం. మననమంటే ఆలోచన. భగవంతుడున్నాడని చెప్పేవాడి కాభావాన్ని గూర్చిన స్పురణ ఎలా ఉందో లేడని వాదించే వాడికి అలాగే ఉంది. లేడని ఒకడు వాచా అంటున్నాడంటే మనసా దాన్ని గూర్చిన ఒక స్పృహ Awareness ఉంటే గదా అంటాడు. అది ఎంత అస్పష్టమైన దైనా కావచ్చు.అయినా ఆ పదార్దానికి చెందినదే ఆ ఆలోచన.

అయితే వాడు బొత్తిగా లేడని చాటుతున్నాడు గదా-అది ఒప్పుకోట మెలా అవుతుందని అడగవచ్చు. వాడొక వేళ లేదన్నా అది సర్వత్రా ఉండనే ఉంది. భగవంతుడనే వాడికి కాళ్ళూ చేతులూ కళ్ళూ చెవులూ- ఉన్నాయంటే గదా నీక్షు బాధ. కేవలం సచ్చిత్తులనే భావాన్నే మేము భగవంతుడని చెప్పటం. ఈ సచ్చిత్తులనేవి లోకంలో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తాయి మనకు. నీవూ నేనూ చూచే ప్రతి పదార్ధమూ సత్తే చిత్తే. ప్రతి ఒక్కటీ ఉందనే చూస్తున్నాము. కనిపిస్తున్నదనే చెబుతున్నాము. ఏదీ లేదనీ కనిపించటంలేదనీ వాకొనలేము. లేకుండా కనిపించకుండా పోయిన పదార్థాన్ని గూర్చి నీవు మాటాడలేవు సరిగదా అసలా లోచించను గూడాలేవు. అది సృష్టిలో-అసంభవం. కాబట్టి ప్రపంచాన్ని చూస్తున్నా మంటేనే-అది సచ్చిదాత్మకంగానే కనిపిస్తున్నది. ఈ సచ్చిత్తులే పరమాత్మ అని పేర్కొన్నాము ఇక ఈశ్వరుడు లేడని వాదించడం దేనికి. ఎంత నాస్తికుడు కూడా ప్రపంచం లేదని చెప్పలేడు గదా. ప్రపంచం లేదన లేదంటే అప్పటి కీశ్వరుణ్ణి కూడా లేదనటం పొసగదు.

ఒకవేళ నామ రూపాత్మకమైన ప్రపంచాన్నే అంగీకరిస్తాము-మీరు చెప్పే సచ్చిత్తుల నంగీకరించమంటారా. సచ్చిత్తు లెత్తిన అవతారాలే ఆ నామ రూపాలని మా సమాధానం. నీవు నామ మనేది దాని నామమే. నీవు రూపమనేది దాని రూవమే దాని విభూతే Expansion ఈ చరా చరప్రపంచమంతా. ఒక మృత్తికవిభూతే ఘటశరావోదంచనాదులయినట్టు - ఒక సువర్ణ విభూతే కటక కుండలకేయూరాదు లయినట్టు- ఇదంతా దాని విభూతే. “రసోహ మప్పు కౌంతేయ సర్వతః పాణి పాదమ్‌ తత్‌ - మయాతత మిదమ్‌ సర్వమ్- మత్తః పరతరమ్ నాస్తి-అని భగవానుడే సెలవిస్తాడు.
అంచేత నాస్తికుడు మొదలు కొనీ-మహాయోగి వరకూ ప్రతి ఒక్క మానవుడూ ఆ తత్వాన్ని భజించే వాడే వాస్తవంలో. అయితే ఆ భజించటంలో ఒక్కొక్కరి దొక్కొక్క దృష్టి విశషమయి ఉండవచ్చు. అంత మాత్రమే తేడా అసలు లేదనే అభావ దృష్టి ఒకడిదైతే అంతా నా స్వరూప మనే సర్వాత్మ భావ దృష్టి వేరొకడిది. పోతే ఈ ఇద్దరిమధ్యలో ఉన్నారు మిగతా మానవులంతా అందులో విగ్రహ రూపంగా భజించే వారు కొదరూ -జ్యోతిః స్వరూపంగా చూసేవారు కొందరూ-మంత్రరూపమైన శబ్ధంగా భావించే వారు కొందరూ-శూన్యంగా దర్శించేవారు కొందరూ- ఒకటిగాదు రెండుగాదు. పరశ్శతంగా ఉంటాయి వారి వారి ప్రపత్తి మార్గాలు. అధికారి భేధమనేది ఒకటి ఉంది గదా. మరి వారి Approach లో వైవిధ్యమెలా లేకపోతుంది.
అయితే ఇక్కడ చిత్ర మేమంటే లోకంలో ఎవరా పరమాత్మ నెలా భావిస్తే వారి నా ఈశ్వరు డలాగే చూస్తాడని చెప్పటం. నాస్తికుల కాతత్త్వం నాస్తికంగానే కనిపిస్తుంది. అజ్ఞేయ వాదుల కజ్ఞేయంగానే ఉండిపోతుంది. హేతువాదులకు హేతురూవమే అది. పోతే ఆస్తికులలో అర్హులైన వారి ఆర్తిహరణ చేసి కాపాడుతుంది. అలా కాపాడకనే పోతే ఇన్ని మొక్కుబళ్ళూ- ఇన్ని సేవలూ- ఇన్ని ఉత్సవాలూ చేయనక్కరలేదు. ఫలితముండకపోతే మానవుడేపనీ చేయడుగదా. కాబట్టి ఆ పన్నులపాలిటి కాపద మొక్కులవాడా ఈశ్వరుడు మరితత్త్వ జిజ్ఞాసువు లయి ఏ ఫలమూ కోరనివారి కాయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అర్ధార్ధులు కర్ధాన్ని ప్రసాదిస్తాడు. పోతే జ్ఞానులైన వారికి జ్ఞాననిష్ఠ నిస్తాడు. నిష్ఠా పరులకు మోక్ష ఫలాన్నే అందజేస్తాడు. మొత్తానికందరినీ అన్నివిధాలా అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎవరినీ ఉపేక్షించడు.

మరి ఇన్ని విధాల అనుగ్రహించటాని కిందరు దేవుళ్ళు లేరుగదా అని ఆశంక చేయరాదు. స్వరూపత: ఆయన ఏకమైనా విభూతిత: అనేకం. నిరాకారమైనా సాకారం. అవ్యక్తమైనా వ్యక్తం. సచేతనమైనా అచేతనం. "నచ్చ త్యచ్చ భవ" త్తంటున్నది శాస్త్రం. కాబట్టి అ భావం దగ్గరనుంచి భావం దాకా ఏ రూపమైనా ధరించగలడు. సాధకుల నెట్లాగైనా అనుగ్రహించగలడు. సందేహం లేదు. అయితే మన దృష్టిని బట్టే మన సాధన. మన సాధనను బట్టే ఆయన ఇచ్చే ఫలమనే సత్యాన్ని మరచిపోరాదు.