#


Back

ఇదుగో ఇలా తెలిసీ తెలియని ప్రసంగం చేయటం వల్లనే అర్జునుణ్ణి చీవాట్లు పెడుతున్నాడు భగవానుడు. నరుడికి బోధ చేయవలసింది నారాయణుడే గదా అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకొని మనబోటి నరుల కందరికీ చేసే బోధ అది. సరిగా అర్జునుడి కున్న అవలక్షణమే మనందరికీ కూడా ఉంది. మనకు కొంత తెలుసు. కొంత తెలియదు. తెలియని దాన్ని తెలుసు కొందామనే ఓపిక లేదు మనకు. అంతా తెలిసినట్టు పండితులం కాకపోయినా లేని పాండిత్యాన్ని ఒలక బోస్తుంటాము. పాండిత్యమంటే నీవూ నేనూ అనుకొనేది గాదు పాండిత్యం. చచ్చినవారి కోసం గాని చావబోయేవారి కోసం గాని ఏమాత్రమూ పలవించ కుండా ఉండ గలగటమే అసలైన పాండిత్యం- అని చాటుతున్నాడు. భగ వాసుడు.

పండా ఆత్మ విషయా బుద్ధిః- సా యేషాం తే పండితాః- పండ అంటే ఆత్మ విషయమైన జ్ఞానం. అది ఎపడి కుంటే వాడు పండితుడు. ఈ కనిపించే శరీరమూ- ఇదే నేనని భ్రమించే జీవుడూ- ఇది రెండూగాక వీటి రెంటినీ గ్రహిస్తున్న శుద్ధమైన చైతన్య మేదో అదీ ఆత్మ. అది ప్రతి ఒక్క ప్రాణీ లోపలా వెలపలా కూడా వ్యాపించి ఉన్నది. దానికీ శరీరాదులన్నీ ఉపాధులే Medium. ఉపాధు లనేవి భౌతికం Physical కాబట్టి ఎప్పటి కప్పుడు మార్పు చెందు తుంటాయి. మార్పు చెందటం వల్లనే ఎప్పుడో ఒకప్పుడు పూర్తిగా మార్పుచెంది మరణిస్తాయి.

పోతే చైతన్య మనేది ఇలా మార్పు చెందేది గాదు. మార్పుల నన్నిటినీ కనిపెట్టి చూచెది కాబట్టి మార్పు చెందదు. అదీ మారితే దాని మార్పును తెలుసుకొనేది వేరొకటి కావలసి వస్తుంది. కనుక అది మారేది కాదు. మారేది కాకపోతే మరణించేది కూడా కాదు. కాబట్టి చైతన్య మనేది నిత్య సిద్ధం. దానికి గోచర మయ్యే శరీర మనః ప్రాణాధికమైన ప్రపంచమంతా ఇక అనిత్యమే. వీటికే ఆత్మానాత్మలని పేరు పెట్టారు వేదాంతులు. ఆత్మ అమృతం. అనాత్మ మృతం.

ఇందులో మృతమైన అనాత్మనే ఆత్మ అని భ్రమపడుతున్నాము మనమంతా. శరీరాది సంఘాతాన్నే గడా మనం నేను-నేను-అని అభిమానించి వ్యవహరిస్తు న్నాము. ఎప్పుడీ తాదాత్మ్య బుద్ధి Identity పెట్టుకొన్నామో అప్పుడీ శరీరం పోగానే మనమూ పోవలసి వస్తున్నది. అంటే దాని మరణాన్ని మన కారోపణ చేసుకొంటున్నాము! ఇది ఆత్మ ఏదో అనాత్మ ఏదో వివేచన చేయకపోవటం వల్ల కలుగుతూ ఉన్న అనర్థం.

Page 2