#


Index

విభూతి యోగము

ప్రాణమూ లేదా క్రియ. ఈ రెండింటికీ సంకేతాలే బ్రహ్మ క్షత్రియులని పేర్కొన్నాము. వారే మహర్షులూ మనువు లనే మాటల అంతరార్ధం. మహర్షి మానవుడి మనస్సు. మనువు వాడి ప్రాణం అవే స్త్రీ పురుష భావాలు. జ్ఞానం పురుషుడూ క్రియ స్త్రీ పురుషుడి సంకల్పమూ స్త్రీ ప్రసవ క్రియా రెండింటిలోనూ ఇమిడి ఉన్న అంతరార్థం కూడా ఇదే. అసలు జీవుడి స్వరూపం కూడా మనః ప్రాణాలే గదా. అవి ఉంటే జీవితం. పోతే మరణం. ఇంతవరకే జీవుడను కొంటే జనన మరణాలు తప్పవు. కాని ఇంత కతీతమైన వీటి రెండింటికీ మూలభూతమైన అఖండ చైతన్యమొకటి ఉంది అది నా స్వరూపమేనని గుర్తిస్తే అప్పుడీ జీవ భావమెగిరి పోయి వీడే పరమాత్మ అవుతాడు. అప్పుడిక జనన మరణాలనే ప్రశ్న లేదు. యో మా మజమనాది మని గీత బోధించిన మోక్ష పదవినే అందుకోగలడు. ఇంతదూరముందీ గీతా వాక్యాలలో గాంభీర్యం.

ఏతాం విభూతిం యోగంచ- మమ యో వేత్తి తత్త్వతః
సో_వి కంపేన యోగేన - యుజ్యతే నాత్ర సంశయః -7


  మంచిదే. కాని ఇదంతా ఏమిటను కొంటాన్నారీ సృష్టి. అది మహర్షులనండి. మానవులనండి. స్థావర జంగమ రూపమైన ప్రాణికోటి అనండి. ఇదంతా మే మేకరువు పెడుతున్నామంటే నిజంగా ఇది జరిగిందనే భావిస్తున్నారా మీరంతా. ఏదీ జరగా లేదు. చేయా లేదు వాస్తవంలో. ఇదంతా కేవలం నా విభూతే నా విస్తారమే నని అసలు రహస్యం

Page 293

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు