• Youtube
    •  
    • English
    •  

వేదాంత పరిభాషా వివరణము

Back

ఇది ఒక నిఘంటువు. మామూలు నిఘంటువు కాదు. వేదాంత పరిభాషను వివరించే నిఘంటువు. చాలావరకు వేదాంత గ్రంథాలలో వచ్చే శబ్దాలనే తీసుకొని వాటికి మాత్రమే అర్థాన్ని చెబుతూ వచ్చానిందులో. అదీ ముక్కకు ముక్కగా గాక వివరణాత్మకంగా చెబుతూ వచ్చాను. కనుక దీన్ని కేవలం నిఘంటువుగానే భావించనక్కరలేదు పాఠకులు. ఒక చక్కని వేదాంత గ్రంథాన్ని చదివినట్టే చదువుకొంటూ పోవచ్చు. అలా చేస్తే వేదాంత శాస్త్రమూ బోధ పడుతుంది. తన్మూలంగా అందులో వచ్చే పారిభాషిక పదాలకూ అర్థం తెలిసిపోతుంది. వేదాంత జ్ఞానమలవరుచుకోవాలని అభిలషించే వారందరికీ పరిభాష Terminology అనేది ఒక గండగత్తెర. దాన్ని భేదించి లోపలికి వెళ్ళితేగాని శాస్త్రమేమి చెబుతున్నదో ఆకళింతకు రాదు. అలాంటి ఇబ్బంది తొలగించటానికే ఈ కృషి. చాలావరకు అలాంటి పారిభాషిక శబ్దాలన్నీ పోగుచేశానిందులో. అన్నీ చేశానని కూడా చెప్పలేను. అకారాది క్రమంలోనే పెట్టి అర్థాలు వ్రాస్తూ వచ్చాను. అందులో ద్వితీయ తృతీయ వర్ణాలు కూడా అలాంటి క్రమంలోనే పాటించాననీ చెప్పలేను. ప్రథమ వర్ణం వరకూ క్రమం తప్పలేదు. అయినా మిగతా వాటి విషయంలో వ్యత్యాస మక్కడక్కడ దొరలి ఉండవచ్చు. నా దృష్టిలో ఇది కేవలం నిఘంటువనే గాదు. ఆ నెపంతో తయారైన ఒక అద్వైత వేదాంత గ్రంథం. మీ దృష్టి కూడా చాలావరకదే కాబట్టి పరవాలేదు. పదేపదే చదువుతూ పోయారంటే శాస్త్రజ్ఞానం చక్కగా ఏర్పడుతుంది. దానితోపాటు శబ్దార్థ జ్ఞానమెలాగూ అలవడుతుంది. మరేమి కావాలి మనకు. మన ఇరువురి అభిమతమూ నెరవేరినట్టే భావించవచ్చు. అయినా ఎక్కడైనా మీకింకా కొరత ఉంటే తెలపండి నాకు. దేవుడు మేలు చేస్తే ఈ మారు ఇంకా బాగా తీర్చి దిద్దుతా నీ కోశ గృహాన్ని. మంచి ముహూర్తం చూచి గృహ ప్రవేశం చేద్దాము మనమంతా. ఇక సెలవు.

- గ్రంథకర్త-

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు









అ    ఆ    ఇ    ఈ    ఉ     ఊ    ఋ

ఏ    ఐ    ఓ     ఔ    క    ఖ    గ

ఘ    చ    జ    త    ద    ధ    న

ప    ఫ    బ    మ    య    ర    ల

వ    శ    ష    స    హ    క్ష



<

Back







     All Rights Reserved by M.Sudhakar  - 9440524168